తెలంగాణ పాలిటిక్స్ లో తెలుగుదేశం జపం.!

Publish Date:Sep 4, 2026

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందన్నది వాస్తవం. అయితే..  తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పాత్ర  ఆ పార్టీపై  ప్రత్యర్థులు   కొనసాగిస్తున్న  విమర్శల దాడి  మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.  దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన ఒక ప్రధాన రాజకీయ శక్తిగా టీడీపీకి తిరుగులేని  చరిత్ర ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 

రాష్ట్ర విభజన అనంతర  కాలంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ  ప్రత్యర్థి పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం రివాజుగా మారిపోయింది. తెలంగాణ గడ్డపై పార్టీకి ఉన్న బలమైన పునాదులను, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు చెబుతుంటారు.  

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..  టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం లేదా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం రాజకీయ ప్రత్యర్థులకు మామూలైపోయింది. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులు,  ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం. 

అయితే..  తెలుగుదేశంపై విమర్శలను ప్రత్యర్థి పార్టీలు కేవలం   ఎన్నికల సమయాలకే పరిమితం చేయడంలేదు.. తమకు అవసరమైన ప్రతిసంర్భంలోనూ రాజకీయ వేడిని రగల్చడానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారు.  రాష్ట్రంలో అధికార,  ప్రతిపక్ష పార్టీలక మధ్య   మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన అన్నది అనివార్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రస్తావనే తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేస్తుందన్న భావన తెలంగాణ రాజకీయ పార్టీలలో బలంగా పేరుకుపోయిందనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది.  

తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఆమె తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించారు. రేవంత్ లో ఉన్నది తెలుగుదేశం రక్తం కనుకనే కక్ష పూరితంగా తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్, అలాగే కొత్తగా సొంత కుంపటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, అధికార కాంగ్రెస్ తెలుగుదేశం జపం లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే తెలంగాణలో తెలుగుదేశం బలానికీ, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టుకూ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

[TDP in Telangana Politics, Telugu Desam Party, Telangana PoliticsNews, TDP Rivals Target, TeluguOne]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.